21, జనవరి 2008, సోమవారం

ప్రేమలేఖ..

తొలిసారి కురిసింది తొలకరి పూల వాన

మదిలోన వెలిసింది నిను చూసిన తరుణాన

చూసినది మొదలు వికసించింది నా హౄదయాన

మునుపెన్నడూ లేదు ఈ చిలిపి ఆలోచన

రెప్పపాటు కలిసిన మన చూపుల సాక్షిగా

హౄదయాంతరంగాలలో జనించే అనంత ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వలేకున్నా
ఏమని చెప్పాలో తెలియక ఎలా చెప్పాలో అర్థంగాక

రాద్దామనుకున్నా ప్రేమలేఖ రాయలేకున్నా నీనుండి చూపు మరల్చుకోలేక

రాయడానికి భాష రాక వచ్చిన భాషలో పదాలు దొరక్క

దొరికిన పదాల్లో భావాలు చిక్కక చిక్కిన భావాల్లో ఛందస్సు రాక
రాని ఛందస్సు కోసం ఇక్కట్లు పడలేక ఇలా తగలడింది ఈ లేఖ...

2 కామెంట్‌లు:

Bolloju Baba చెప్పారు...

దొరికిన పదాల్లో భావాలు చిక్కక చిక్కిన భావాల్లో ఛందస్సు రాక
రాని ఛందస్సు కోసం ఇక్కట్లు పడలేక ఇలా తగలడింది ఈ లేఖ...

అప్పటిదాకా బాగానే నడిపించిన కవితను ఎందుకలా తగలపెట్టేసారు. (మీ మాటే).
దొరికిన పదాల్లో భావాలు చిక్కక
మౌనమే దిక్కయి, మూగచూపులే శరణ్యమై
మౌన భాషని, చూపుల లిపిని
నీవు తెలుసుకుంటావని,
నన్ను కలసుకుంటావని...........

అంటూ సాగితే ఇంకొంచెం అర్ధవంతంగా, అందం గా ఉంటుందేమో. ఆలోచించండి.
ఎక్కువ చనువుతీసుకుటున్నానని అనుపిస్తే, జస్ట్ ఇగ్నోర్.
మంచిగా నడచిన కవిత, కొంచెం తడపడినట్లనిపిస్తే, చెప్పాలనిపించింది.

బొల్లోజు బాబా

చంద్రశేఖర్ కాటుబోయిన చెప్పారు...

hello baba garu...sorry andi..

alaa saradagaa theesukunnaa...anthe andi..