18, నవంబర్ 2007, ఆదివారం

సాగర తీరాన...

సాగర తీరాన నే ఎదురుచూసిన నా మరుమల్లి రాక...మూగబోయిన నా మనసుకు మాటలు నేర్పెనే....!
శిశిరపు చల్ల గాలికి నడయాడే నీ ముంగురుల నాట్యం.. ఎగసిపడే అలల సవ్వడి తొ జతకట్టెనే..!
సడి చేసే నీ గాజుల గలగలల శబ్ధా రావం...మది లో కోటి అలల స్వరాలను మీటెనే…...!
రెప రెపలాడే నీ పైట కొంగు తాకిడి...రాకుడని కొత్త ఆలొచనలను రగిలించెనే...!
ఘల్లు ఘల్లుమనే నీ కాలి మువ్వల సవ్వడి...ఝల్లుమంటూ నా హౄదయాంతరంగాలలో సుప్రభాతం పాడెనే...!
మెరిసే నీ అధరాల మధురామౄతం..విరిసే నా చిలిపి దరహాసానికి స్వాగతం పలికెనే...

1 కామెంట్‌:

అగంతకుడు చెప్పారు...

బాగా రాస్తున్నారు. అలాగే కంటిన్యూ చేయండి.