
ప:చెలీ నీ తోడు వుంటా గడసరి తిరిగి చూడే ఒక పరి వెన్నెల మాటుగా..కొమ్మల చాటుగా..
చాలు నీ మాటలూ తుంటరి మరులు గొలుపె తదుపరి నేనే నీవుగా నీవే నేనుగా..
చ:కోయిల రాగం..కుహు కుహు గానం చెలి సన్నిధికే చేరా..
కిల కిల రావం మదిలో భావం జతగా కలిసే రాదా..
చాలుమరి చెంతకొచ్చీ చేరిపో కౌగిలిలో కరిగిపో బిడియమేలనే..గడియ తీయవే.."చెలి నీ తోడూ"
చ:నేటి వసంతం తీయని బంధం నిలవాలి కలకాలం..
ఈ మధుమాసం నీ దరహాసం మెరవాలి మనకోసం..
కురిసిన మేఘమల్లే వచ్చిపో..వలపులన్నీ ఇచ్చిపో..మబ్బుల చాటునా హద్దులు దాటనా.. "చెలి నీ తోడూ"
4 కామెంట్‌లు:
రచన చాలా బాగుంది. keep it up
thanks KK..
మీ బ్లాగ్ ఇంతకు ముందు చూసాను .. అప్పుడు అడగాలనుకున్న ప్రశ్న ఆ ప్రక్కన ఉన్న పొటోలో బాబు మీరేనా అని :)చాలా క్యూట్ గా ఉన్నాది మొహం
నేస్తమా,
ఆ ఫోటో నాది కాదు..మా బాబు ది.బ్లాగ్ అంతా చూస్తే మా అవిడ ని కూడా చూడొచ్చు మీరు..
ఇంతకి,నా పాట పై మీ అబిప్రాయం చెప్పలేదు..అలాగే మిగతా వాటిపై కూడా మీ అబిప్రాయం సెలవియ్యండి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి