19, ఆగస్టు 2010, గురువారం

అమ్మ..నా మొదటి దేవత

సృష్టి లో తీయని పదం అమ్మ..సృష్టికి మూలం అమ్మ..

స్వచ్చ్హమైన ప్రేమకు ప్రతి రూపం నిశ్చలమైన నిర్మలత్వానికి తుదిరూపం

కమ్మనైన ఆ అమ్మ మాట ..నమ్మకమైనది ఆమె బాట..

నిను తలవని మాట లేదు ఏ పూట.. కొలవని దేవుడు లేడు ఏ చోట..

మధురమైన అమ్మ అనే పిలుపు ..కలిగించు ఆమెలో సుమధుర తలపు..

పెళ్ళి లో కన్నెగా తొలివలపు.. కట్టుకున్నోడితో జీవితం కడవరకు

మరు ఏట పండింది ఆమె కడుపు..నవమాసాలు మోసింది తుదివరకు

పురిటినొప్పులతో తన ఏడుపు.. అమ్మ మాటలతో ఆటవిడుపు ..

అలుపెరుగక అలసటతో కానుపు.. ఇది మొదలు మాత్రమే అన్న పెదవి విరుపుతో పానుపు..

జన్మ ఇచ్చింది బిడ్డ కొరకు.. మరోజన్మ కు తగ్గ ఖ్యాతి దక్కింది తనకు

వంశం నిలిపింది మగడి తరపు .. తన జీవితానికిదో కొత్త మలుపు

అమ్మతనము తన నగుమోములో తుదకు.. ఋణగ్రస్తుడై ఆజన్మాంతం నిలవాలి కొడుకు కడవరకు

-- మా అమ్మకు అంకితం --చంద్ర