ఏమని చెప్పను ఎన్నని చెప్పను..?
మన freshers day రోజున అనుకోకుండా వేసిన కిటుకులు తెలిసిన చిటపట చినుకుల పాట చిందులకు వచ్చిన చప్పట్ల మోత గురించి చెప్పనా.. ?
అమరావతి పర్యటనలో ఆహ్లాదంగా గడచిన ఆ మధురానుభూతుల మాధుర్యాల గురించి చెప్పనా..?
హాస్టల్లో చిరు పాట చిత్రలహరిలొ రాగానె చిందేసిన గెంతుల గురించి చెప్పనా..?
చంద్ర కళ ఈ చంద్ర చెల్లికి కొన్న నైటీ సహకారపు ఆనవాల్లు చెప్పనా..?
general quiz లో మొదటి బహుమతి సాధించిన విజయ దరహాసాల vizag trip గురించి చెప్పనా..?
మొదటిసారి జీవితంలో Fail అన్న పదాన్ని పరిచయం చేసిన EM Subject గురించి చెప్పనా..??
BSN reDDi class లో బిక్కు బిక్కు మంటూ బిత్తరపోయిన సంఘటనలు గురించి చెప్పనా..?
దొంగ చాటుగా గోడ దూకి విజయలక్ష్మి థియేటర్లో చూసిన second shows గురించి చెప్పనా..?
చంద్ర మౌళీ గారు చెప్పే అంతరిక్షపు గ్రహాల్లో నే వూహించుకున్న నా స్వప్న సుందరి గురించి చెప్పనా..?
College Annual Day కు చిరు పాటకు Stage మీద అడుగుపెట్టి లయబద్దంగా వేస్తున్న అడుగులు అర్థాంతంగా ఆగిపోయి రెచ్చిపోయిన కుల విషనాగుల కాట్లకు ఈ కాటుబోయిన ఎంతలా వ్యధ చెందాడొ చెప్పనా..?
వీడ్కోలు వేదనలో విడవలేక స్నేహితులను కార్చిన కన్నీటి కథ చెప్పనా..?
చివరగా...ఒక్కమాట..
కుల కౌగిట్లో నలిగిన నా సహ విద్యార్థుల వేదన గురించి ఈ ఒక్క వాక్యంలో నే చెప్పగలనా?
వదిలితే వందపేజీలు నిరాఘాటంగా రాసి ఆ క్షుద్రమూకల దౌర్జన్యాలను,వారి ఆగడాలను ఓ మహా కావ్యంగా వేయి పడగలా కాకున్నా ఓ వంద పడగలా అయినా రాయగలనని ..మీ
-చంద్ర కాటుబోయిన
ఆటా పాటా అన్నిట్లో మేటీనే ..
బరిలో దిగితే లేడెవరూ పోటీనే ..
మాటా మాటా కలిపాడంటే
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నీ పేరేందో దెలువది
నీ ఊరెందో దెలువది
నువ్ యేడుంటవో దెలువది
నువ్ ఎట్లుంటవో దెలువది
ఐనా నా ఎద సాటు
నీ బొమ్మే గీసుకున్న
నీ పేరే రాసుకున్న
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాదైతుందే నీ యాదిల నా గుండెల్ల
నిన్నూ జదివిన నుంచి నన్నూ నేను మరిసిన
అన్నీ ఇడిసిపెట్టిన నిన్నే ఒడిసి పట్టిన
నిన్నూ జదివిన నుంచి నన్నూ నేను మరిసిన
అన్నీ ఇడిసిపెట్టిన నిన్నే ఒడిసి పట్టిన
ఎక్కడనా చేతినుంచి జారిపోతవో అని
గుబులైతాందే గుండె బరువైతాందే
పరిసానైతాందే పాణమెళ్లి పోతాందే
నిన్ను తెలియగ నెంచి
నన్ను నేను మరిసిన
అంతట నిన్ను గాంచిన
అందరి మంచి గోరిన
ఎప్పుడు ఈ గ్యానం నా మతిలో నిలిచేలా
నిండి పోరాదే
నా గుండెల ఉండి పోరాదే
చివరకు నేనే నువ్వై మిగిలి పోవాలే
2 కామెంట్లు:
https://bit.ly/4aTuYBQ
Ammalu the lanjalu
కామెంట్‌ను పోస్ట్ చేయండి